
తిరుమలాయపాలెం ఆగస్టు 15 (నమస్తే న్యూస్)
సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు శనివారం గజ్జల వెంకటయ్య భవన్ లో జాతీయ పతాకాన్ని సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను ఆవిష్కరించారు ఈ సందర్భంగా కొమ్ము శ్రీను మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ ఐక్యత, ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను నాయకులు నెర్సుల వెంకటేశ్వర్లు పోలే బోయిన ముత్తయ్య కొమ్ము నాగేశ్వరరావు సోమ పొంగు రాము మట్టి కార్తీక్ నెర్సుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
