తిరుమలాయపాలెం ఆగస్టు 15 (నమస్తే న్యూస్ )
ప్రజా పిర్యాదుల వ్యవస్థలో పారదర్శకత , జవాబుదారీతనం, స్వందనశీలతను పెంపొందించి పిర్యాదుల పరీస్కారాన్ని వేగవంతం చేయుటకు “ప్రజావాణి” కార్యక్రమాన్ని మండల స్థాయికి విస్తరింప చేయాలనే ఉద్దేశ్యముతో ప్రభుత్వం ఈ ఉత్తర్వులను నెంబరు 4 ప్లానింగ్ డిపార్టుమెంటు ద్వారా జారీ చేసింది. మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం మండల పరిషత్ కార్యాలయం, తిరుమలాయపాలెం నందు ప్రతి సోమవారం ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 వరకు నిర్వహించబడుతుందని ఎంపీడీవో షేక్ సిలార్ సాహెబ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలాయపాలెం లోని అందరు మండల స్థాయి అధికారులు ఇట్టి “ప్రజావాణి” కార్యక్రమంలో పాల్గొని ప్రజలనుండి వచ్చు అర్జీలను స్వీకరించి పరిస్కారంకొరకు తగు చర్యలు తీసుకుంటారు. ఇట్టి “ప్రజావాణి” కార్యక్రమానికి నోడల్ అధికారిగా మండల పరిషత్ అభివృధి అధికారి పాల్గొంటారని తిరుమలాయపాలెం మండలం లోని ప్రజలు వారి సమస్యలు ఏమైన ఉంటే ప్రతి సోమవారం మండల పరిషత్ కార్యాలయంకు వచ్చి వారి వారి సమస్యలను పరిష్కరించుటకు మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరుగుతుందని దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తిరుమలాయపాలెం ఎంపీడీవో షేక్ సిలార్ సహాబ్ తెలిపారు.

