తిరుమలాయపాలెం ఆగస్టు 15 ( న్యూస్ నమస్తే):విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ, వివిధ అంశాలపై సమయానుకూలంగా సమాచారాన్ని సేకరించి ఉన్నతాధికారులకు అందించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో విశేషంగా సేవలందిస్తున్న తిరుమలాయపాలెం మండలం లో పనిచేస్తున్న సిటీ స్పెషల్ బ్రాంచ్ సిఎస్ బి ఫీల్డ్ ఆఫీసర్ వీరబాబుకు మరోసారి గుర్తింపు లభించింది.స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా వీరబాబు ప్రశంసా పత్రం సర్టిఫికెట్ ఆఫ్ అప్ప్రెసియేషన్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ కమిషనర్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.సిటీ స్పెషల్ బ్రాంచ్ ఫీల్డ్ ఆఫీసర్గా వీరబాబు నిత్యం మండలం లోని వివిధ గ్రామాల్లో పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తూ, వివిధ అంశాలపై సమాచారాన్ని సేకరించి ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు అందిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. వివిధ డ్యూటీలలో సమర్థవంతంగా పనిచేస్తూ విధి పట్ల అంకితభావం, నిబద్ధతతో సేవలందిస్తున్నందుకు ఈ ప్రశంసా పత్రం అందజేశారు.విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచినందుకు గతంలో కూడా వివిధ సందర్భాల్లో పలుమార్లు ప్రశంసా పత్రాలతో పాటు రివార్డులు అందుకున్నారు. నిత్యం క్షేత్రస్థాయిలో పనిచేస్తూ సమయస్ఫూర్తితో సమాచారాన్ని సేకరించి ఉన్నతాధికారులకు అందించడంతో పాటు, వివిధ డ్యూటీలలో చూపుతున్న ప్రతిభకు లభిస్తున్న ఈ వరుస గుర్తింపులు ఆయన సేవలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గతం లో వివిధ డ్యూటీల్లో ప్రతిభ కనబరిచి ప్రశంసలు, రివార్డులు అందుకున్న సిటీ స్పెషల్ బ్రాంచ్ ఫీల్డ్ ఆఫీసర్ వీరబాబుకు తాజాగా ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా మరో ప్రశంసా పత్రం అందుకోవడం ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది.ఈ సందర్భంగా వీరబాబును పోలీసు అధికారులు, కూసుమంచి సర్కిల్ లోని ఎస్ ఐ లు కూచిపూడి జగదీష్ నాగరాజు దివ్యశ్రీ సంతోష్ సీఐ సంజీవ్ సిబ్బంది అభినందించారు. విధి నిర్వహణలో లభిస్తున్న వరుస ప్రశంసలు, రివార్డులు మరింత అంకితభావంతో పనిచేసేందుకు ప్రోత్సాహాన్ని అందిస్తాయని పేర్కొన్నారు.

