తిరుమలాయపాలెం ఆగస్టు 15 (నమస్తే న్యూస్ )
తిరుమలాయపాలెం మండలం లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రం తహసిల్దార్ కార్యాలయం లో లూథర్ విల్సన్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ ఐ కూసుపూడి జగదీష్ ఎంపీడీవో కార్యాలయంలో షేక్ సిలార్ సాహెబ్ వ్యవసాయ శాఖ కార్యాలయంలో నా రెడ్డి సీతారాం రెడ్డి వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో సూపర్డెంట్ డాక్టర్ కృపా ఉషశ్రీ కస్తూరిబాయ్ కళాశాలలో ప్రిన్సిపాల్ కె రమకుమారి వెటర్నరీ వైద్యశాలలో డాక్టర్ అనూష తిరుమలాయపాలెం విద్యుత్ శాఖ కార్యాలయంలో గడ్డం నరేందర్ రెడ్డి ఇందిరా క్రాంతి పథకం కార్యాలయంలో సత్యనారాయణ రాజు పాటు వివిధ గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు జాతీయ పతాకాలను ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద సర్పంచ్లు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఆయా గ్రామ పంచాయతీలలో పంచాయతీ కార్యదర్శులు ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది, గ్రామస్తులు జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు.స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పలువురు పేర్కొన్నారు. గ్రామాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి.


