డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 15(నమస్తే న్యూస్)ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్న మరిపెడ మండల తహశిల్దార్ శ్రీమతి కృష్ణవేణి ప్రజలకు చేస్తున్న సేవలను గుర్తించిన జిల్లా ఉన్నతాధికారులు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన వేడుకలో ప్రభుత్వ విప్-డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రాంచంద్రు నాయక్ చేతుల మీదుగా ఆమెకు ఉత్తమ అవార్డును అందజేశారు.జిల్లా కలెక్టర్ స్నేహ శభరీష్, ఎస్పీ డాక్టర్ శభరీష్, కలెక్టరేట్ అధికారులు,సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ప్రజా సమస్యల పరిష్కారంలో చూపిన చొరవ, పారదర్శకత, అంకితభావానికి గాను ఈ అవార్డు లభించిందని అధికారులు తెలిపారు.

