ప్రశ్నిస్తే ఎజెంట్లకు బెదిరింపులు.
ఎజెంట్లు గంట శ్రీనివాస్,కందిపాటి విజయ్ కుమార్ ఆరోపణలు.
డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 15 (నమస్తే న్యూస్).
గ్రీన్ సిటీ వెంచర్ పేరుతో భారీ డెవలప్మెంట్ చేస్తామని చెప్పి ప్లాట్లు అమ్మి,దశాబ్దం దాటినా కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని ఎజెంట్లు ఆరోపించారు.పైగా నిలదీసినందుకు డెవలపర్ బెదిరింపులకు దిగుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నీ హామీలే.అమలు శూన్యం:మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో చుండ్రు రాజ్‌కుమార్ అనే వ్యక్తి జీపీ లేఅవుట్ పేరుతో గ్రీన్ సిటీ వెంచర్‌ను ఏర్పాటు చేశారు. వెంచర్ చుట్టూ పెన్సింగ్, అంతర్గత రోడ్లు,వాటర్ ట్యాంక్,పార్కులు తదితర సౌకర్యాలు కల్పిస్తామని ఎజెంట్లకు హామీ ఇచ్చి ప్లాట్లు అమ్మించారు.డెవలపర్ రాజ్ కుమార్ మాటలు నమ్మి ఎజెంట్లు కూడా కస్టమర్లకు వివరించి ప్లాట్లను విక్రయించారు. అయితే 9 నుంచి 10 సంవత్సరాలు గడిచినా ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు.దీంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఎజెంట్లపై ఒత్తిడి తీసుకురావడంతో, వారు డెవలపర్‌ను పలుమార్లు నిలదీశారు.ఈ మేరకు శుక్రవారం బయ్యారం గ్రామస్థులైన ఎజెంట్లు గంట శ్రీనివాస్, కందిపాటి విజయ్‌కుమార్, గంట రేణుక విలేకరులతో మాట్లాడారు.రాజ్ కుమార్ ని,కస్టమర్లు డెవలప్మెంట్ గురించి రోజూ అడుగుతున్నారు.మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అని డెవలపర్ చుండ్రు రాజ్‌కుమార్‌కు ఎన్నిసార్లు చెప్పినా ఆయన మాట దాటవేస్తున్నారని వారు తెలిపారు.కస్టమర్ల నుంచి ఒత్తిడి పెరగడంతో మళ్లీ ప్రశ్నించగా, మీరేం చేసుకుంటారో చేసుకోండి.ఎక్కువగా మాట్లాడితే ఏం చేస్తానో చూడండి అంటూ రాజ్‌కుమార్ మరియు అతని అనుచరులు ఫోన్ చేసి తమను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.న్యాయం చేయాలని విజ్ఞప్తి:దశాబ్దం కావస్తున్నా వెంచర్లో ఎలాంటి డెవలప్మెంట్ లేకపోవడంతో ప్లాట్లు కొన్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎజెంట్లు వాపోయారు.ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు వెంటనే జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని వారు కోరారు.ఇవి ఎజెంట్లు చేసిన ఆరోపణలు కాగా ఈ అంశంపై డెవలపర్ వర్గం వివరణ ఇంకా రావాల్సి ఉంది.

