రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం ఆగస్టు 14 (నమస్తే న్యూస్)
కాకరవాయి గ్రామం లో శుక్రవారం నూతనంగా ఏర్పాటు చేసిన స్పైసీ హబ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు రామ సహాయం నరేష్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం నరేష్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో కూడా నూతన వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు పెరగడం శుభపరిణామమన్నారు. స్థానికంగా ఏర్పాటు చేస్తున్న వ్యాపార సంస్థలు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు పలువురికి ఉపాధి కల్పిస్తాయని అన్నారు. స్పైసీ హబ్ ఫ్యామిలీ రెస్టారెంట్‌ను నాణ్యత, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేలా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. ప్రజల అభిరుచులకు అనుగుణంగా మంచి ఆహారాన్ని అందిస్తూ రెస్టారెంట్‌ను అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు.*అనంతరం గ్రామంలో నూతనంగా మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన చౌక ధరల దుకాణాన్ని నరేష్ రెడ్డి సందర్శించారు అక్కడ ప్రజలకు అందుతున్న రేషన్ సరుకులను పరిశీలించి, దుకాణం నిర్వహణ తీరును తెలుసుకున్నారు. రేషన్ బియ్యం నాణ్యతపై ప్రజలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా నరేష్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. పేద కుటుంబాలకు నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో నాణ్యమైన సన్నబియ్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. గతంలో రేషన్ బియ్యం నాణ్యతపై ప్రజల్లో అనేక ఇబ్బందులు ఉండేవి. అలాంటి పరిస్థితి లేకుండా నాణ్యమైన సన్నబియ్యం అందించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పం అని అన్నారు.పేద ప్రజల కడుపు నింపే రేషన్ బియ్యం విషయంలో నాణ్యతకు ఎలాంటి రాజీ ఉండకూడదు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు సక్రమంగా చేరేలా చూడాలి. రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు ఇబ్బందులు లేకుండా సరుకులు అందించాలి. ప్రజలకు ఉపయోగపడే పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని నరేష్ రెడ్డి పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు అందేలా నాయకులు, కార్యకర్తలు నిరంతరం ప్రజల మధ్య ఉండాలని సూచించారు. అనంతరం వారు శాలువా కప్పి అభినందించారు..కార్యక్రమంలో మండల నాయకులు కట్కూర్ శ్రీనివాస్ రెడ్డి,మోరపాక నాగయ్య, మాజీ ఎంపీటీసీ బుద్ధ వంశీకృష్ణ, గుండాల లింగయ్య, తగడబోయిన కృష్ణ, నల్లగట్టు చంద్రకిరణ్, గుండెబోయిన శ్రీశైలం,గుండాల మహేష్, గుండెబోయిన గంగరాజు, గుండాల వెంకన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, రేషన్ దుకాణ నిర్వాహకులు, స్పైసీ హబ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నిర్వాహకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

