బాల వికాస సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం.
డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 14(నమస్తే న్యూస్).
ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని వైద్యాధికారి డాక్టర్ గుగులోత్ రవి సూచించారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామంలో బాల వికాస సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి డాక్టర్ గుగులోత్ రవి,సర్పంచ్ బోడ సోమన్న,ఉప సర్పంచ్ షరీఫ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా డాక్టర్ గుగులోత్ రవి మాట్లాడుతూ పరిశుభ్రత పాటించడం ద్వారా అనేక రకాల వ్యాధులను నివారించవచ్చని తెలిపారు.ప్రజలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని,అనారోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు.వైద్య శిబిరంలో గ్రామస్తులకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. బాల వికాస సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకున్నారు.కార్యక్రమంలో పాల్గొన్నవారు.హెల్త్ సూపర్వైజర్ ఆచార్యులు,సంస్థ సెంటర్ మేనేజర్ గంధసిరి ఉపేంద్ర, కోఆర్డినేటర్లు జజ్జూరి ఉపేంద్ర, గుగులోత్ కవిత, ఏఎన్ఎంలు అనిత, స్వప్న, గ్రామ పెద్దలు రాయల రవి,ఉషా, యాదగిరి, గ్రామ లీడర్లు సమ్మక్క, ఆశా వర్కర్లు మాధవి,జ్యోతి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

