
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం ఆగస్టు 14 (నమస్తే న్యూస్ )
మండలంలోని వెదుళ్ల చెరువు పాఠశాల అభివృద్ధి తో పాటు, సామాజిక సేవా కార్యక్రమాలకు దాతలు ముందుకు వచ్చి సేవలు చెయ్యడం అభినందనీయమని మండల తహసీల్దార్ లూథర్ విల్సన్ అన్నారు. శుక్రవారం మండలం లోని వెదుళ్ల చెరువు పాఠశాలలో కమతం రాము స్నేహితుడు, లండన్‌కు చెందిన జాన్ కోప్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు దుస్తువులు,నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్ పంపిణీ చేయడంతో పాటు వృద్ధులు, అనాథలకు చీరలు, దుస్తులు అందించే కార్యక్రమం లో పాల్గొని మాట్లాడారు. లండన్ కి చెందిన జాన్ కోప్ తన మిత్రుడు రాము ద్వారా గత అనేక సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందించారు. అనారోగ్యంతో కంటి చూపుని కోల్పోయినప్పటికీ గ్రామంలో విద్యాభివృద్ధి కి కృషి చెస్తున్న కమతం రాముని శాలువా కప్పి అభినందించారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆరేంపుల వినోద ఉపసర్పంచ్ పులకాని రమేష్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవి, గ్రామ పెద్దలు కమతం బాబు, వల్లభనేని వినయ్ కుమార్, శ్రీకాంత్, డాక్టర్ సుధీర్ సాయి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.


