12 ఏళ్లలో 6 వేల ఉద్యోగాలు సాధించిన ఘనత కైట్స్ అకాడమీదే..
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం ఆగస్టు 14 (నమస్తే న్యూస్)
విద్యారంగంలో విశేష సేవలు అందిస్తూ వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న కైట్స్ అకాడమీ డైరెక్టర్ వి.తిరుపతి కి ప్రతిష్ఠాత్మక విద్యారత్న అవార్డు లభించింది. కైట్స్ అకాడమీని స్థాపించిన 12 సంవత్సరాల కాలంలోనే సుమారు 6 వేల మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించేలా శిక్షణ అందించడం అకాడమీకి దక్కిన ఘనతగా నిలిచింది.కైట్స్ అకాడమీ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందిస్తూ, ఉద్యోగ సాధనకు అవసరమైన మార్గదర్శకత్వం కల్పిస్తున్న వి.తిరుపతి సేవలను గుర్తించిన నిర్వాహకులు ఆయనకు విద్యారత్న అవార్డును అందజేశారు. అతి చిన్న వయసులోనే ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకోవడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని తిరుపతి తెలిపారు.గురువారం హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వేదికగా జరిగిన కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి సముద్రాల వేణుగోపాల చారి చేతుల మీదుగా తిరుపతి విద్యారత్న అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను అభినందించారు.అనంతరం మాజీ కేంద్రమంత్రి సముద్రాల వేణుగోపాల చారి మాట్లాడుతూ.. కైట్స్ అకాడమీ గత 12 సంవత్సరాలుగా విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందిస్తూ, వారిని ఉద్యోగ సాధన దిశగా తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. ఇప్పటికే సుమారు 6 వేల మంది ఉద్యోగాలు సాధించడం కైట్స్ అకాడమీ పనితీరుకు నిదర్శనమని కొనియాడారు. భవిష్యత్తులో కూడా కైట్స్ అకాడమీ నుంచి మరింత మంది విద్యార్థులు అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కైట్స్ అకాడమీ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.

