
డోర్నకల్ /మరిపెడ,ఆగస్టు 14(నమస్తే న్యూస్).
కళ్ళను జాగ్రత్తగా చూసుకుంటేనే ప్రపంచాన్ని చూడగలమని ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ అన్నారు.మహబూబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని కార్గిల్ సెంటర్ లో శ్రీ నేత్ర కంటి ఆసుపత్రి మరియు ఆప్టికల్స్ ను ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ ప్రారంభించారు.వైద్యవృత్తి ఎంతో గొప్పదని,ప్రజలకు నమ్మకం కలిగే విధంగా వైద్యం చేసి మంచి పేరును సంపాదించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గుగులోతు రవి నాయక్,చైర్ పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి,వైస్ చైర్మన్ కాలం సునీత రవీందర్ రెడ్డి,టౌన్ అధ్యక్షులు రాంలాల్,కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు గంధసిరి బిక్షపతి,బాలాజీ,లింగయ్య, సత్యం ఇంకా తదితరులు పాల్గొన్నారు

