రేషన్ షాపులో 14 రకాల నిత్యావసర సరుకులు అందించాలి: బాణాల రాజన్న.
డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 14(నమస్తే న్యూస్).
భూమిలేని వ్యవసాయ కార్మికులందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఏటా 12 వేల రూపాయలు అందించాలని,రేషన్ షాపుల్లో 14 రకాల నిత్యావసర సరుకులు పేదలకు అందించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బాణాల రాజన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆగస్టు 14 శుక్రవారం మరిపెడ మండలం చిల్లంచర్ల గ్రామంలో వ్యవసాయ కార్మికుల సమావేశం సంఘం నాయకులు చేనబోయిన వెంకన్న అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో రాజన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీతో పాటు పేదలకు 14 రకాల నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయాలని కోరారు.ప్రస్తుతం రేషన్ కార్డుపై ఒక వ్యక్తికి 6 కిలోల బియ్యం మాత్రమే అందుతున్నాయని అన్నారు.పెరిగిన ధరలకు అనుగుణంగా పేద కుటుంబాల ఆదాయాలు పెరగకపోవడంతో వారు పౌష్టికాహారానికి దూరమవుతున్నారని,దీంతో పిల్లల్లో రక్తహీనత,అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.పేదలకు పౌష్టికాహారం అందించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు.బియ్యంతో పాటు కందిపప్పు,శనగపప్పు,పెసరపప్పు,మంచి నూనె,గోధుమలు,కోడిగుడ్డు,మిల్లెట్స్,చక్కెర,చింతపండు,పసుపు తదితర 14 రకాల సరుకులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.అనంతరం 15 మందితో సంఘం నూతన కమిటీ ఎన్నికైంది.నూతన కమిటీ సభ్యులు:గ్రామ గౌరవ అధ్యక్షుడు:చేనబోయిన ఎంకన్న,అధ్యక్షురాలు:బొజ్జ మంగమ్మ,కార్యదర్శి:ఎడ్ల రాములు,ఉపాధ్యక్షురాలు: కేతమ్మ కోశాధికారి:ఉప్పమ్మ,సభ్యులు:తూము మధు,మాములురి హుస్సేన్,ఉండ్రాజ్ సురేష్,భద్రమ్మ,లింగమ్మ,లచ్చమ్మ,జ్యోతి తదితరులు పాల్గొన్నారు

