రామన్నపేట ఆగస్ట్ 14 (నమస్తే న్యూస్ )
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామపంచాయతీ పరిధిలో పారిశుధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు పనిచేస్తున్న సిబ్బందికి నూతన దుస్తులు, అవసరమైన సానిటరీ మెటీరియల్ను పంపిణీ చేశారు,ఈ సందర్భంగా గ్రామపంచాయతీ సిబ్బంది ప్రజలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని సర్పంచ్ గర్దాసు విక్రమ్ పేర్కొన్నారు. సిబ్బంది విధులు నిర్వహించే సమయంలో రక్షణ, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ నూతన దుస్తులు, గ్లౌజులు, మాస్కులు తదితర సానిటరీ సామగ్రిని అందజేసినట్లు తెలిపారు,గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తూ, ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచేందుకు సిబ్బందితో పాటు ప్రజలు కూడా సహకరించాలని ఈ సందర్భంగా కోరారు,ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు,ఉపసర్పంచ్ జయసుధ స్వామి,పంచాయతీ కార్యదర్శి వీసం నరేందర్, వార్డు సభ్యులు కంబాలపల్లి సత్తయ్య, రాధారపు మహేశ్,వరికుప్పల స్వామి, నాగలక్ష్మిరాజు ,కప్పల మంగమ్మ రాజు, పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

