రామన్నపేట ఆగస్ట్ 14(నమస్తే న్యూస్ )
యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా, తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు శానగొండ రాము పిలుపునిచ్చారు,కొమ్మాయిగూడెం గ్రామంలో నిర్వహించిన డివైఎఫ్ఐ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నేటి సమాజంలో యువతను మద్యం, గంజాయి, డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ విద్య, ఉపాధి, క్రీడలు, సామాజిక సేవల వైపు అడుగులు వేయాలని సూచించారు.యువత ఎదుర్కొంటున్న ఉపాధి, విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి తదితర సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమించాలని ఆయన కోరారు. యువత సమస్యలపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు క్రీడా మైదానాలు, యువజన కేంద్రాలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.యువతే దేశ భవిష్యత్తు అని, సమాజ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని శానగొండ రాము అన్నారు. యువజన సమస్యల పరిష్కారం కోసం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మరిన్ని ఉద్యమాలు చేపడతామని తెలిపారు.

