రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం ఆగస్టు 13 (నమస్తే న్యూస్)
ఖమ్మం జిల్లా, తిరుమలాయపాలెం మండలం, బీరోలు గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగ మహోత్సవాన్ని గ్రామ ప్రజలందరూ ఐకమత్యంతో, భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా మరియు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు.ఈ పవిత్రమైన బోనాల పండుగలో గ్రామపంచాయతీ సర్పంచ్ గుమ్మడి దేవ బిక్షం బీరోలు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు మరియు గ్రామ ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.అందరూ కలిసి శ్రీ ముత్యాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు పొందుతూ బోనాల ఉత్సవాన్ని భక్తిశ్రద్ధలతో, సంతోషంగా మరియు ఘనంగా జరుపుకున్నారు.మన గ్రామ ఐక్యతకు, సంస్కృతి మరియు సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగ ప్రతి సంవత్సరం మరింత వైభవంగా జరగాలని కోరుకుంటున్నాము.శ్రీ ముత్యాలమ్మ తల్లి కరుణాకటాక్షాలు బీరోలు గ్రామ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, పాడిపంటల సమృద్ధి వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము.జై శ్రీ ముత్యాలమ్మ తల్లి!జై జై ముత్యాలమ్మ తల్లి!అమ్మవారి ఆశీస్సులు మన గ్రామ పానుగంటి శ్రీనివాస్ రెడ్డి (పెద్ద రెడ్డి మరియు రైతు సమన్వయ కార్యకర్త అయిన అన్నం అరుణా రెడ్డి కొప్పుల రామ్ రెడ్డి మరియు కొత్తపల్లి సత్యనారాయణరెడ్డి దేవాలయ చైర్మన్ అలాగే పుల్గుజ్జు మంగమ్మ రావుల నరేష్ రెడ్డి పానుగంటి పుల్లారెడ్డి మిర్యాల విక్రమ్ రెడ్డి మాజీ ఉపసర్పంచ్ గుండా రఘురాం రెడ్డి గుండా శ్రీనివాస్ రెడ్డివంచర్ల సత్యనారాయణ రెడ్డి అలివేలమ్మ మాజీ సర్పంచ్ అలాగే గ్రామంలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులకు అలాగే గ్రామంలోని యువతీ యువకులకు పెద్దలకు చిన్నారులకు మొదలైన ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలి.ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులతో అందరికీ శుభం కలగాలి.

