మాజీ ఎమ్మెల్యే రెడ్డ్యా నాయక్ కారుకు తప్పిన ప్రమాదం.

డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 13(నమస్తే న్యూస్).
మరిపెడ మండలం అబ్బాయిపాలెం శివారులో గురువారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది.రైస్‌మిల్లు వద్దకు వెళ్లే ప్రధాన రహదారిపై మాజీ ఎమ్మెల్యే రెడ్డ్యా నాయక్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది.ప్రత్యక్ష సాక్షుల వివరాల మేరకు..ముందు వెళ్తున్న ఒక బైక్ సడన్‌గా రోడ్డు మధ్యలో యూ-టర్న్ తీసుకుంది.అదే సమయంలో రోడ్డుపై ఎదురుగా కూలీలు నడుచుకుంటూ రావడంతో,ప్రమాదాన్ని నివారించేందుకు డ్రైవర్ కారు వేగాన్ని ఒక్కసారిగా తగ్గించారు.గమనించని వెనుక కారు డ్రైవర్ వెనుక నుంచి అతివేగంగా ముందుకు దూసుకొచ్చిన మరో కారు,ముందు నెమ్మదించిన ఎమ్మెల్యే వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.ఢీకొట్టిన ధాటికి కారు వెనుక భాగం పూర్తిగా దెబ్బతింది.ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యేతో పాటు కారులో ఉన్న వారెవరికీ గాయాలు కాలేదు.ప్రాణాపాయం తప్పడంతో స్థానికులు మరియు పార్టీ కార్యకర్తలు ఊరట పొందారు.ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే రెడ్డ్యా నాయక్ క్షేమంగా ఉన్నారని ఆయన సన్నిహితులు వెల్లడించారు.
