డోర్నకల్ ,ఆగస్ట్ 13(నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమళ్ళ సంకీశ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ డైరెక్టర్ మోటమర్రి రామారావు ఇటీవల మోకాలి ఆపరేషన్ చేయించుకోవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్ గురువారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. రామారావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్, బిక్షం రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు పటాన్ జమాల్, మంద వీరారెడ్డి, శెట్టి అమరేందర్, గండు ఉపేందర్, కాసం వెంకన్న, వేమూరి వెంకటేశ్వర్లు, యువజన నాయకులు కొర్ని సంతోష్, వీరబాబు, రాజేష్, మధు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

