రిపోర్టర్:దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం,ఆగస్టు 13 (నమస్తే న్యూస్ )
రాష్ట్ర మంత్రివర్యులు, అలుపెరగని ప్రజా నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను, వాడిన దుర్భాషలను అత్యంత తీవ్ర స్థాయిలో ఉన్నాయని వాటిని భీష్రతుగా ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలని మండల కాంగ్రెస్ నాయకులు కట్కూరి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కనీస రాజకీయ సంస్కారం లేకుండా ఒక రాష్ట్ర మంత్రిని ఉద్దేశించి అడ్డగోలుగా, అహంకారపూరితంగా మాట్లాడటం కౌశిక్ రెడ్డి దిగజారుడుతనానికి పరాకాష్ట.
నిత్యం ప్రజల మధ్య ఉంటూ, అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పొంగులేటి గురించి విమర్శించే స్థాయి, అర్హత కౌశిక్ రెడ్డికి లేదని కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం, మీడియాలో చౌకబారు ప్రచారం పొందడం కోసమే కౌశిక్ రెడ్డి ఇలాంటి అసంబద్ధమైన కూతలు కూస్తున్నాడని తన సొంత నియోజకవర్గంలో సమస్యలను గాలికొదిలేసి, నిత్యం వివాదాలు సృష్టించడమే పనిగా పెట్టుకున్న కౌశిక్ రెడ్డికి పొంగులేటి ని విమర్శించే నైతిక హక్కు ఏమాత్రం లేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి ఉన్న అపారమైన ప్రజాదరణ, బలగం ముందు కౌశిక్ రెడ్డి తన స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడితే మంచిది.రాజకీయాల్లో హుందాగా వ్యవహరించడం నేర్చుకో, అంతేకానీ వీధి రౌడీలాగా మైకు దొరికింది కదా అని ఇష్టానుసారం ప్రేలితే సహించే ప్రసక్తే లేదు.కౌశిక్ రెడ్డి వెంటనే తన పద్ధతి మార్చుకోకపోతే, శ్రీ పొంగులేటి అభిమానులు మరియు ప్రజల ఆగ్రహ జ్వాలలకు గురికాక తప్పదని నాయకుల మధ్య విధానపరమైన విమర్శలు ఉండాలి కానీ, ఇలా వ్యక్తిగత దూషణలకు దిగితే భవిష్యత్తులో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయన్నారు.తెలంగాణ సమాజం అసహ్యించుకునేలా ఉన్న నీ భాష, నీ ప్రవర్తన ప్రజాస్వామ్యానికే తలవంపులు తెస్తోంది.
ఇకనైనా నీ నోటిని అదుపులో పెట్టుకుని, ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా హుందాగా వ్యవహరించడం నేర్చుకో.పొంగులేటి గురించి గానీ, ఆయన కుటుంబ సభ్యుల గురించి గానీ మరోసారి నోరు జారితే చూస్తూ ఊరుకునేది లేదని తక్షణమే కౌశిక్ రెడ్డి తన అనుచిత వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

