దంతాల బాలరాజు అధ్యక్షతన కాకరవాయి, కొక్కిరేణి, ఎర్రగడ్డ నుంచి తరలింపు
బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనరాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్.
రిపోర్టర్: దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం,ఆగస్టు 13 (నమస్తే న్యూస్ )
బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు నిర్వహిస్తున్న ప్రజా చైతన్య యాత్ర ముగింపు సభకు సీపీఐ శ్రేణులు భారీగా తరలివెళ్లారు.ఖమ్మం జిల్లా కౌన్సిల్ సభ్యులు దంతాల బాలరాజు అధ్యక్షతన తిరుమలాయపాలెం మండలంలోని కాకరవాయి, కొక్కిరేణి, ఎర్రగడ్డ గ్రామాల నుంచి సీపీఐ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ముగింపు సభకు బయలుదేరారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాటాలు కొనసాగించాలనే లక్ష్యంతో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించినట్లు సీపీఐ నాయకులు తెలిపారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ యాత్ర ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించినట్లు పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.రైతులు, కార్మికులు, పేదలు, నిరుద్యోగులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని సీపీఐ నాయకులు కోరారు. ప్రజా సమస్యలపై పోరాటాలను మరింత బలోపేతం చేసేందుకు ముగింపు సభలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్లు తెలిపారు.కాకరవాయి, కొక్కిరేణి, ఎర్రగడ్డ గ్రామాల నుంచి సీపీఐ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు దంతాల బాలరాజు, మండల అధ్యక్షుడు బత్తుల రాధాకృష్ణ, సిపిఐ మండల నాయకులు చావా వెంకట్రావు చీమ రామకృష్ణ కాకరవాయి ఏఐటియుసి నాయకులు భూక్య శ్రవణ్, ధరావత్ శ్రీను, నల్లగట్టు జనార్ధన్, నల్లగట్టు సామేలు, నల్లగట్టు రవి, నల్లగట్టు శ్రీను, మండలి సైదులు, తవడబోయిన గోపయ్య,దాసరి రాములు, రైతు సంఘం నాయకులు వీరబోయిన శ్రీను, పెనుగొండ కనకయ్య, మోర మల్సుర్, మోర ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

