- బిజెపి రాష్ట్ర నాయకులు గాదె రాంబాబు.
డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 12(నమస్తే న్యూస్).
స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ(బీజేపీ)దేశవ్యాప్తంగా మరియు తెలుగు రాష్ట్రాలలో ఆగస్టు 10 నుండి 15 వరకు ‘హర్ ఘర్ తిరంగా( ప్రతి ఇంటిపై జాతీయ జెండా)కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.అందులో భాగంగానే మహబూబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో పాఠశాల విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు.ఇది పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాకుండా ప్రజలలో దేశభక్తిని పెంపొందించే విధంగా చూడాలని బిజెపి రాష్ట్ర నాయకులు గాదె రాంబాబు అన్నారు.ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి ప్రజల్లో దేశభక్తిని ఐక్యతను పెంపొందించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హర్ ఘర్ తీర్గ్ ఇంచార్జ్ వెన్ను సాగర్,బిజెపి పట్టణ అధ్యక్షురాలు భూక్యా లింగం మంగమ్మ నాయaక్,మరిపెడ మండల అధ్యక్షులు గంగాధర్, బిజెపి జిల్లా కౌన్సిల్ సభ్యులు భూక్యా సుధాకర్ నాయక్,జగన్ నాయక్,బిజెపి సోషల్ మీడియా కన్వీనర్ జక్కుల నాగరాజు,బింగి రమేష్,పాకాల రఘురాం శర్మ, కాంతమ్మ,రేఖ అశోక్, విద్యార్థులు ఇంకా తదితరులు పాల్గొన్నారు.

