రామన్నపేట ,ఆగస్ట్ 12(నమస్తే న్యూస్ )
యాదాద్రి భువనగిరి జిల్లారామన్నపేట పెద్ద చెరువుకు ధర్మారెడ్డిపల్లి కాలువ ద్వారా ఫీడర్ ఛానల్ ఏర్పాటు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల ప్రధాన కార్యదర్శి కందుల హనుమంతు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.వ్యవసాయ కార్మిక సంఘం, ముదిరాజ్ మత్స్యకారుల సంఘాల ఆధ్వర్యంలో బుధవారం రామన్నపేట మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల హనుమంతు మాట్లాడుతూ ,రూ.300 కోట్ల నిధులతో కాలువ నిర్మాణ పనులు చేపడుతున్న నేపథ్యంలో కొమ్మాయిగూడెం మీదుగా వెళ్తున్న ధర్మారెడ్డిపల్లి కాలువకు ఫీడర్ ఛానల్ ఏర్పాటు చేసి రామన్నపేట పెద్ద చెరువుకు నీటిని అందించాలని కోరారు,కాలువ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు, మత్స్యకారులకు నీరు అందించాలని డిమాండ్ చేశారు. అలాగే వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించి, రామన్నపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు,పిట్టల మచ్చగిరి, బచ్చా రాములు, కందుల శ్రీశైలం, బచ్చా వెంకటేశం, రేపాక పోచమ్మ, కందుల లలిత, కేశబోయిన ఇంద్రమ్మ, లక్ష్మి, సత్తమ్మ, పద్మ, యాట అనసూయ, మంగమ్మ, లక్ష్మి, సిద్ధం రమేష్, తదితరులు పాల్గొన్నారు.

