- బూత్ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్న నాయకులు
మరిపెడ,ఆగస్టు12(నమస్తే న్యూస్):
మరిపెడ మున్సిపల్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ బూత్ కమిటీల నిర్మాణ సమావేశాలు బుధవారం నిర్వహించారు.పీసీసీ అబ్జర్వర్ హవీజ్ ఖాన్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి,పట్టణ అధ్యక్షుడుపానుగోతురాంలాల్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా 1వ వార్డు కమిటీ అధ్యక్షుడిగా జాటోతు నెహ్రూ,3వ వార్డు కమిటీ అధ్యక్షుడిగా అనంతగిరి శ్రీను,4వ వార్డు కమిటీ అధ్యక్షుడిగా షేక్ యాకుబ్ పాషా,5వ వార్డు కమిటీ అధ్యక్షుడిగా బోడ రవి,6వ వార్డు బోడ రమేష్ నాయక్,7 వ వార్డు బంక ప్రమోద్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు బూత్ కమిటీలు కీలకంగా పనిచేయాలని,ప్రతి బూత్‌లో పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ కాలం సునీత రవీందర్ రెడ్డి,కౌన్సిలర్లు మెరుగు రాము,జాటోతు సురేష్,తిరుపతి,జియో రమేష్,పానుగోతు రాములు,కోఆప్షన్ సభ్యులు గుండగాని వెంకన్నతో పాటు కాంగ్రెస్ నాయకులు గంధసిరి అంబరీష్,షేక్ తాజోద్దీన్,అలువాల ఉపేందర్ ప్రజాపతి,గంధసిరి బిక్షపతి,కరణ్ సింగ్,బోడ రవి,బంక ప్రమోద్,గుంటి రవి,తాడూరి రమేష్, లింగన్న,గంధసిరి సోమన్న,మెరుగు సత్యనారాయణ,బోడ శ్రీను,సాజిద్,తగురు శ్రీను,అనంతగిరి రవి, ఉదయ్ నాగేశ్వరరావు,దేవేందర్,బావ్ సింగ్,లాల్ సింగ్,భాషిత్ ఖాన్తదితరులు పాల్గొన్నారు.


