రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం,ఆగస్టు 12 (నమస్తే న్యూస్ )
తెలంగాణ టీ జేఏసీ ఖమ్మం జిల్లా నూతన చైర్మన్‌గా సుబ్లేడు గ్రామానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు మందడి ఇజ్రాయిల్ నియమితులయ్యారు. ఇటీవల నిర్వహించిన టీ జేఏసీ సమావేశంలో ఆయనను ఖమ్మం జిల్లా చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు తెలిపారు.నూతన బాధ్యతలు స్వీకరించిన అనంతరం బుధవారం మందడి ఇజ్రాయిల్ ఖమ్మం రూరల్ ఏసీపీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి, కుసుమంచి సీఐ సంజీవ్‌లను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.ఈ సందర్భంగా ఏసీపీ తిరుపతి రెడ్డి, సీఐ సంజీవ్ నూతనంగా జిల్లా టీ జేఏసీ చైర్మన్‌గా ఎన్నికైన మందడి ఇజ్రాయిల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. జేఏసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం, ప్రజా హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు.అనంతరం మందడి ఇజ్రాయిల్ ఏసీపీ, సీఐలకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి జిల్లా చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించిన టీ జేఏసీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో జేఏసీని మరింత బలోపేతం చేస్తూ ప్రజా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గాదరి బాబు, గాదరి వెంకన్న, జి. రవితో పాటు టీ జేఏసీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

