డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 12(నమస్తే న్యూస్).
మరిపెడ మున్సిపల్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ బూత్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది.ఇందులో భాగంగా ఐదవ వార్డ్ కమిటీ అధ్యక్షుడిగా బోడ రవి నీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు,బూత్ కార్యదర్శిగా పానుగోత్ దల్ సింగ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అనంతరం దల్సింగ్ మాట్లాడుతూ..కష్టపడ్డవారిని పార్టీ గుర్తిస్తుందని,కష్ట పడ్డందుకు ఫలితం దక్కింది అన్నారు.కాంగ్రెస్ పార్టీ గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పార్టీకి కష్టపడి పనిచేసి మంచి పేరు తీసుకొస్తానన్నారు,నన్ను నమ్మి నాపై నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రన్ నాయక్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు.ఈ ఎన్నికకు సహకరించిన మున్సిపాలిటీ చైర్ పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి,వైస్ చైర్ పర్సన్ రవీందర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు రామ్‌లాల్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు…

