విద్యార్థుల్లో లక్ష్యసాధనకు ‘ఇంపాక్ట్ మినీ ప్రోగ్రాం’ స్ఫూర్తి
గోల్ సెట్టింగ్, టైమ్ మేనేజ్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్పై అవగాహన
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం,ఆగస్టు 12 (నమస్తే న్యూస్)
తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో జూనియర్ కళాశాలలో
విద్యార్థులు తమ జీవితానికి స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వ్యక్తిత్వ వికాసంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు.పిండిప్రోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇండియన్ కామన్ ఫార్మర్స్ క్లబ్ – తెట్టెలపాడు, అధ్యక్షులు బొమ్మగాని నరసింహారావు గారు మరియు వారి బృందం, ఎన్ఎస్ఎస్ యూనిట్, ప్రభుత్వ జూనియర్ కళాశాల పిండిప్రోలు ఆధ్వర్యంలో IMPACT INTERNATIONAL – MINI IMPACT REGION-3 అవగాహన కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు.
ఇంటర్ విద్యార్థులు, 10వ తరగతి విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులను ఉద్దేశించి నిర్వహించిన ఈ కార్యక్రమంలో గోల్ సెట్టింగ్, టైమ్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్, గ్రాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్, యాంటీ నార్కోటిక్స్ అవగాహన వంటి అంశాలపై ప్రముఖులు విద్యార్థులకు విలువైన సూచనలు అందించారు.వక్తలు మాట్లాడుతూ విద్యార్థి దశలోనే జీవిత లక్ష్యాలను నిర్ణయించుకోవడం, ప్రతిరోజూ సమయాన్ని ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవడం, మంచి ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవడం ద్వారా జీవితంలో గొప్ప విజయాలను సాధించవచ్చని తెలిపారు. “లక్ష్యం లేని జీవితం దిశ లేని ప్రయాణం వంటిది” అని పేర్కొంటూ విద్యార్థులు తమ భవిష్యత్తుపై స్పష్టమైన దృష్టితో ముందుకు సాగాలని సూచించారు.అలాగే కృతజ్ఞతా భావం, సానుకూల దృక్పథం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం వంటి విలువలు వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదపడతాయని వివరించారు. చెడు అలవాట్లకు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన మరియు బాధ్యతాయుతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ జాతీయ కార్యదర్శి మారోజు రమేష్, రీజియన్-3 అధ్యక్షులు డా. నవాబ్ భాషా, ఎన్సీ–ట్రైనింగ్–ఐసీఐ సుప్రియ కొత్తపల్లి, ప్రభుత్వ జూనియర్ కళాశాల పిండిప్రోలు ప్రిన్సిపాల్ ఎస్. రామకృష్ణ, ఇండియన్ కామన్ ఫార్మర్స్ క్లబ్ అధ్యక్షులు బి. నరసింహారావు, అలాగే ఎస్ఐ కుచిపూడి జగదీష్, , లయన్స్ క్లబ్ ప్రతినిధి నాగరాజు, ఇంపాక్ట్ బాధ్యులు ప్రసాద్, సీడీసీ చైర్మన్ రామయ్య, impact సర్వీస్ డైరెక్టర్లు VDS ప్రసాద్ గారు, ఎండి జాకీర్ హుస్సేన్ గార్లు గ్రామ సర్పంచ్ కామెళ్ల సువార్త, తెట్టెలపాడు ఇంపాక్ట్ బృందం తదితర ప్రముఖులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ పాఠశాలల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, పిండిప్రోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, పాత్రికేయులు మరియు ఇతర ప్రముఖులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపుతూ, వారి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసిన ఈ ఇంపాక్ట్ కార్యక్రమం ఎంతో ఉత్సాహభరితంగా సాగింది.



