రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం,ఆగస్టు 12 (నమస్తే న్యూస్)
తిరుమలాయపాలెం మండలంలోని బీరోలు గ్రామంలో బుధవారం యూనియన్ బ్యాంకు ఉన్నది ఈ యొక్క బ్యాంకులో 50000 పైగా అకౌంట్లు కలిగి ఉన్నది కానీ ఈ యొక్క బ్యాంకులో సరైన సిబ్బంది లేకపోవడం వల్ల ప్రజలు గంటల తరబడి సర్వీసు పొందాల్సిన పరిస్థితి వస్తుంది . రైతులు మహిళలు కూలీలు, పేదలు బ్యాంకులో పని కావాలంటే గంటలు తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అందుకు బ్యాంకు సిబ్బందిని అదనంగా నియమించాలని వృద్ధులు వికలాంగులు రైతుల డబ్బులను హోల్ లో పెట్టొద్దని యూనియన్ బ్యాంక్ లో రైతుల పట్టాదారి పాస్ పుస్తకాలు ఒరిజినల్ ని తాకట్టు పెట్టుకోవద్దని శూన్తీ లేకుండా రుణాలు ఇవ్వాలని మహిళలకు ప్రత్యేక రుణాలు ఇచ్చే విధంగా సిబ్బందిని నియమించాలని ఆర్బిఐ నిబంధనలను పాటించాలని కోరుతూ తెలంగాణ రైతు సంఘం సిపిఎం ఆధ్వర్యంలో బ్యాంకు ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది ఈ యొక్క ధర్నా ఉద్దేశించి సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను మాట్లాడుతూ బీరోలు బ్యాంకులో ప్రజలు సేవలు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి వస్తుందని అందుకు వెంటనే సిబ్బందిని నియమించాలని వృద్ధులు వికలాంగులు విత్తంతులు రైతుల డబ్బులను హోల్ లో పెట్టొద్దని ఆయన డిమాండ్ చేశారు రైతుల పట్టాదారి ఒరిజినల్ పాస్ పుస్తకాలు తాకట్టు పెట్టుకోవడం దారుణం అని వెంటనే ఆ యొక్క విషయాన్ని విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు యొక్క సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు కార్యక్రమం అనంతరం బ్యాంకు మేనేజర్ ఫీల్డ్ ఆఫీసర్లకు మెమోరాన్ని సమర్పించడం జరిగింది . ఈ యొక్క కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు తుళ్లూరు నాగేశ్వరరావు బింగ్గి రమేష్ కొత్తపల్లి దామోదర్ రెడ్డి గోపోజు రవి కోడి లింగయ్య యన్నం అరుణ రెడ్డి చాగంటి శ్రీను ఉపేందర్ నాగన్న సత్యం కొమ్ము నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు,


