Type Here to Get Search Results !

త్రైత సిద్ధాంత భగవద్గీత & కృష్ణాష్టమి ఊరేగింపు విశిష్టత పై ప్రచారం.

NAMASTHE NEWS 0

  • త్రైత సిద్ధాంత భగవద్గీత & కృష్ణాష్టమి ఊరేగింపు విశిష్టత పై ప్రచారం




రిపోర్టర్ : దామల్ల భాస్కర్                

తిరుమలాయపాలెం,ఆగస్టు 2 (నమస్తే న్యూస్ )

త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల స్వామి వారి దివ్య ఆశీస్సులతో సెప్టెంబర్ 4 వ తేదీన రానున్న శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ ను పురస్కరించుకొని ఈరోజు "త్రైతసిద్ధాంత ప్రబోధసేవాసమితి ఇందూజ్ఞానవేదిక ఖమ్మం కమిటీ" సభ్యుల ఆధ్వర్యంలో *ఖమ్మం జిల్లా, తిరుమలాయపాలెం మండల కేంద్రంలో త్రైత సిద్ధాంత ఆధ్యాత్మిక గ్రంథముల ఇందూ ధర్మ ప్రచారము ఇంటింటా నిర్వహించడం జరిగినది.శ్రీకృష్ణ భగవానుడి కి మాత్రమే ఊరేగింపు చేయాలి:  దేవుడే అవతరించి ఒక మనిషిగా జన్మిస్తే ఆయనను భగవంతుడు అని అంటాము... అలాంటి భగవంతుడే శ్రీకృష్ణుడు, ఆయనను మాత్రమే అందరూ దైవం గా గుర్తించాలి అని ఊరి లోని వారందరికీ ఎరుక పరచుటకు ఈ ఊరు ఎరిగింపు (ఊరేగింపు) కార్యక్రమం చేయడం జరుగుతుంది అని, పూర్వం శ్రీ కృష్ణాష్టమి 11 రోజుల పాటు చేసేవారు చివరిగా చవితి రోజున ఊరేగింపు చేసి ముగించేవారు. అని ప్రబోధ సేవా సమితి సభ్యులు తెలిపారు. (శ్రీ కృష్ణ పరమాత్మ ఊరేగింపు చేసిన గ్రామంలో ప్రకృతి వైపరీత్యాలు, రోగ బాధలు ప్రజలకు ఉండవు అని పూర్వం పెద్దలనెడివారు. ఈ కార్యక్రమంలో త్రైతసిద్ధాంతం-ప్రబోధ సేవాసమితి ఇందూ జ్ఞాన వేదిక - ఖమ్మం కమిటీ అధ్యక్షుడు, సత్యం గారు ఉపాధ్యక్షులు ఉమేష్ సభ్యులు ,విజయ, అరుణ, విను రాధ, మమత, అలేఖ్య,సుజాత, కల్పన, ప్రహర్షిని, అఖిల్, శ్రీను, రాము, ఉమ, రామ కృష్ణ, నిరోష, పల్లవి, హర్షిత. లు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System