వ్యభిచార ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు.
నర్సింహులపేట పోలీసుల మెరుపు దాడి.. నలుగురు అరెస్ట్, ఒకరు పరార్.
చట్టవిరుద్ధ కార్యకలాపాలపై పోలీసుల కొరడా.. వ్యభిచార ముఠా గుట్టురట్టు
మెరుపు దాడితో వ్యభిచార ముఠా గుట్టురట్టు.
అసాంఘిక కార్య కార్యక్రమాలకు పాల్పడే వారు తప్పించుకోలేరు
-ఎస్సై బానోత్ వెంకన్న
నర్సింహులపేట, జూలై 26 (నమస్తే న్యూస్)
అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే వారు పోలీసుల నుండి తప్పించుకోలేరని నర్సింహులపేట ఎస్సై బానోత్ వెంకన్న హెచ్చరించారు.మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని వస్త్రం తండా స్టేజి సమీపంలో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముఠాపై నర్సింహులపేట పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించి గుట్టురట్టు చేశారు.విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై బానోత్ వెంకన్న ఆధ్వర్యంలో పోలీసులు మెరుపు దాడి చేపట్టగా, ఘటనాస్థలంలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పోలీసులను గమనించి అక్కడి నుంచి పరారైనట్లు తెలిసింది.అదుపులోకి తీసుకున్న వారిని నర్సింహులపేట పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై బానోత్ వెంకన్న తెలిపారు.

