Type Here to Get Search Results !

పోలీస్ ఉద్యోగార్థులకు కైట్స్ అకాడమీ సువర్ణావకాశం

NAMASTHE NEWS 0

  • పోలీస్ ఉద్యోగార్థులకు కైట్స్ అకాడమీ సువర్ణావకాశం
  • నేడు మెగా ఫ్రీ డెమో, ఉచిత అవగాహన సదస్సు





రిపోర్టర్:దామల్ల భాస్కర్              

తిరుమలాయపాలెం,ఆగస్టు 2 (నమస్తే న్యూస్ )

పోలీస్ యూనిఫామ్ ధరించాలనే లక్ష్యంతో ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు ఖమ్మంలోని కైట్స్ అకాడమీ సువర్ణావకాశాన్ని కల్పిస్తోంది. పోలీస్ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు మార్గదర్శకత్వం అందించేందుకు సంస్థ నిర్వాహకులు తిరుమలాయపాలెం  మండలం చెందిన వాంకుడు తిరుపతి నాయక్  ఆధ్వర్యంలో నేడు ఉదయం 10 గంటలకు మెగా ఫ్రీ డెమో, ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నారు.ఈ సదస్సుకు వరంగల్‌కు చెందిన రాష్ట్ర స్థాయి సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ వెంకట్ సర్ ముఖ్య అతిథిగా హాజరై అభ్యర్థులకు ప్రత్యేక క్లాస్ నిర్వహించనున్నారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో కీలకమైన ‘తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ హిస్టరీ’ అంశంపై అభ్యర్థులకు సమగ్ర అవగాహన కల్పించడంతో పాటు, సిలబస్‌పై పట్టు సాధించే విధానం, తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను వివరించనున్నారు.పోలీస్ ఉద్యోగాల లక్ష్యంతో సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఈ ఉచిత అవగాహన సదస్సు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. పోటీ పరీక్షల్లో విజయానికి అవసరమైన ప్రణాళిక, చదివే విధానం, ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించే పద్ధతులపై నిపుణుల సూచనలు అందనున్నాయి.ఈ సందర్భంగా కైట్స్ అకాడమీ డైరెక్టర్ తిరుపతి సర్ మాట్లాడుతూ, ఖాకీ ఉద్యోగమే లక్ష్యంగా కష్టపడుతున్న ప్రతి అభ్యర్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోటీ పరీక్షలకు సరైన మార్గదర్శకత్వంతో పాటు క్రమబద్ధమైన ప్రిపరేషన్ ఎంతో కీలకమని పేర్కొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System