Type Here to Get Search Results !

బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి రావాలంటే యువత ముందుండి పని చేయాలి .

NAMASTHE NEWS 0

బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి రావాలంటే యువత ముందుండి పని చేయాలి.




రిపోర్టర్ దామల్ల భాస్కర్                

తిరుమలాయపాలెం ,ఆగస్టు 2 (నమస్తే  న్యూస్ )

బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి రావాలంటే యువత విద్యావంతులు విద్యార్థులు ముందుకు రావాలని బి.ఎస్.పి పాలేరు నియోజకవర్గ అధ్యక్షులు ఎన్నబోయిన రమేష్  పిలుపునిచ్చారు ఆదివారం తిరుమలాయపాలెం మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ పాలేరు అసెంబ్లీ ముఖ్య కార్యకర్తల సమావేశం బి.ఎస్.పి పాలేరు అసెంబ్లీ అధ్యక్షులు ఎన్నబోయిన రమేష్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది . ఈ సమావేశంలో బహుజన్ సమాజ్ పార్టీ  ఖమ్మం జిల్లా అధ్యక్షులు బుర్ర ఉపేందర్ సాహూ గారు మాట్లాడుతూ మండల కమిటీలు సెక్టార్ కమిటీల నిర్మాణం వేగవంతం చేయాలని సూచించడం జరిగింది. పాలేరు అసెంబ్లీ అధ్యక్షులు ఎన్నబోయిన రమేష్ యాదవ్  మాట్లాడుతూ బీసీలకు వారి జనాభా కు తగ్గట్టుగా వారికి వాటా ఇచ్చే పార్టీ ఈ భారత దేశంలో ఏకైక జాతీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ అని చెప్పడం జరిగింది . బీసీలకు రాజ్యాధికారంలో సమాన వాటా ఇస్తున్నటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ కాబట్టి బీసీ లందరూ అధిక సంఖ్యలో బీఎస్పీలో చేరాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పడం జరిగింది బీసీల రిజర్వేషన్ కోసం పోరాడిన పార్టీ ఏదైనా ఉన్నది అంటే అది బి ఎస్ పి పార్టీ మాత్రమే అని చెప్పడం జరిగింది . ఈ భారత దేశంలో ప్రభుత్వ సంస్థలు గాని ప్రైవేటు సంస్థల్లో గాని రాజ్యాధికారంలో గాని అన్ని రంగాలలో ఎస్సి ఎస్టి బీచి మైనారిటీస్ అగ్రకురస్తులకు వారి జనాభా  ప్రకారం వారికి వాటా ఇచ్చే పార్టీ ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ అని సమ సమాజ నిర్మాణం కోసం భారత రాజ్యాంగం పరిరక్షించడంలో ముందుండే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అని చెప్పడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో గాని చట్టసభల్లో గాని బహుజన్ సమాజ్ పార్టీని గెలిపించుకోవడానికి చైతన్యవంతమైన విద్యావంతులు విద్యార్థులు ప్రజలు ముందుకు రావాలని కోరడం జరిగింది. మరియు బహుజన్ సమాజ్ పార్టీ తిరుమలాయపాలెం మండల అధ్యక్షుడు షేక్ యాకూబ్ పాషా గారు మాట్లాడుతూ మైనారిటీ హక్కులను రక్షించడంలో కాపాడడంలో ఈ భారత దేశంలోనే ముందుండే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అని మైనారిటీలందరూ బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించాలని కుమారి మాయావతి ని ఈ దేశ ప్రధానమంత్రిగా చేయాలని అప్పుడు మాత్రమే బహుజన కులాలకు రక్షణ అని చెప్పడం జరిగింది . ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి మట్టి నాగేశ్వరరావు గారు, పాలేరు అసెంబ్లీ ఇన్చార్జీలు నల్లగట్టు శంకర్ మహరాజ్ బుర్ర ఉపేందర్ (ఉపసర్పంచ్) గారు, పాలేరు అసెంబ్లీ ఉపాధ్యక్షులు జిల్లా మన్సూరు ఆర్.ఎం.పి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System