Type Here to Get Search Results !

రోడ్డు ప్రమాదాలు జరగకుండా యువత ముందడుగు.

NAMASTHE NEWS 0

  • సిమెంట్, ఇసుక, కంకరతో ఆర్‌అండ్‌బీ రోడ్డులో గుంతల పూడ్చివేత.
  • పలువురు ప్రాణాలు బలిగొన్న రహదారిపై సొంత ఖర్చులతో మరమ్మతులు చేసిన దమ్మాయిగూడెం యువకులు.




రిపోర్టర్ :దామల్ల భాస్కర్.                

తిరుమలాయపాలెం,ఆగస్టు 2 (నమస్తే న్యూస్ )

తిరుమలాయపాలెం  మండలం లోని దమ్మాయిగూడెం గ్రామంలో ఆర్‌అండ్‌బీ రహదారిపై ఏర్పడిన భారీ గుంతల కారణంగా గతంలో అనేక రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా, పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. అయినప్పటికీ సంబంధిత అధికారులు శాశ్వత మరమ్మతులు చేపట్టకపోవడంతో గ్రామ యువతే ముందుకు వచ్చి సేవాభావాన్ని చాటుకుంది.ప్రజల ప్రాణాలను కాపాడాలనే సంకల్పంతో దమ్మాయిగూడెం గ్రామానికి చెందిన  ఎస్సీ ఎస్టీ బీసీ యువకులు తమ సొంత ఖర్చులతో సిమెంట్, ఇసుక, కంకర తెప్పించి రహదారిపై ఉన్న గుంతలను పూడ్చి మరమ్మతులు చేపట్టారు. దీంతో వాహనదారులు, గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. యువత చేసిన ఈ సామాజిక సేవను స్థానికులు అభినందిస్తూ, ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడుతున్నారు.అయితే యువత చేసినది తాత్కాలిక పరిష్కారమేనని, ప్రమాదాలకు నిలయంగా మారిన ఈ ఆర్‌అండ్‌బీ రహదారికి సంబంధిత అధికారులు వెంటనే శాశ్వత మరమ్మతులు చేపట్టి నాణ్యమైన రహదారిని నిర్మించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం లో పోలే పొంగు అంజి పోలేపొంగు వంశీ పోలె పొంగు మహేష్ బి రాజు వీరదాసు చందు వీరదాసు సందీప్ వీరదాసు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System