Type Here to Get Search Results !

ఓటరు జాబితా సవరణలో బీఎల్‌ఏల పాత్ర కీలకం..మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్

NAMASTHE NEWS 0

ఓటరు జాబితా సవరణలో బీఎల్‌ఏల పాత్ర కీలకం..మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్. 


ఇంటింటికీ వెళ్లి ఓటరు వివరాలు పరిశీలించండి.. పార్టీ శ్రేణులకు డీఎస్ రెడ్యా నాయక్ పిలుపు.


రానున్న ఎన్నికలే లక్ష్యం.. గ్రామాల్లో పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేయాలి.


బూత్ స్థాయి కార్యకర్తలే పార్టీ బలం.. బీఎల్‌ఏలు అప్రమత్తంగా పనిచేయాలి.


నర్సింహులపేటలో బీఆర్‌ఎస్ మండల స్థాయి ఎస్‌ఐఆర్ సమీక్షా సమావేశం.. కీలక దిశానిర్దేశం.





నర్సింహులపేట, ఆగస్టు 3 (నమస్తే న్యూస్)

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల స్థాయి బీఎల్‌ఏలు, ముఖ్య నాయకులతో ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) అంశంపై విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్ ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు, బీఎల్‌ఏలకు పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ప్రక్రియ అని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా, అనర్హుల పేర్లను నిబంధనల ప్రకారం తొలగించేలా బీఎల్‌ఏలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.గ్రామాల వారీగా పార్టీ నాయకులు, బీఎల్‌ఏలు సమన్వయంతో పనిచేస్తూ ఇంటింటికీ వెళ్లి ఓటరు వివరాలను పరిశీలించాలని, అవసరమైన చోట ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సవరణలు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతంలో బూత్ స్థాయి కార్యకర్తల పాత్ర అత్యంత కీలకమని, ప్రతి కార్యకర్త బాధ్యతగా పనిచేసి పార్టీకి మరింత బలం చేకూర్చాలని సూచించారు.రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామంలో పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేయాలని, కార్యకర్తలు ప్రజలతో నిరంతరం అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు మైదం దేవేందర్, మలిదశ ఉద్యమకారుడు ఎండి ఖాజామియా, మారపంగు వీరన్న, నెలకుర్తి నరసింహారెడ్డి,గుగులోతు రవి, కొండబత్తిని జగదీష్, శ్రీశైలం, సురేష్ నాయక్, రమేష్, ఉపేందర్, నరసయ్య, అనిల్, మదర్,బీఎల్‌ఏలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System