పేద కుటుంబాలకు మంత్రి పొంగులేటి ఆర్థిక సాయం
తిరుమలయపాలెం, ఆగస్టు 3 (నమస్తే న్యూస్):
మండలంలోని బీరోలు గ్రామంలో ఇటీవల కుటుంబ పెద్దలను కోల్పోయిన నాలుగు నిరుపేద కుటుంబాలకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన వ్యక్తిగత నిధుల నుంచి ఆర్థిక సాయం అందించారు. ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.40 వేల చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.ఆర్థిక సాయం పొందిన వారిలో బర్ల నరసమ్మ, బూర్గు రాములు, కందుకూరి సురయ్య, చారి సీతయ్య కుటుంబాలు ఉన్నాయి.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కష్టకాలంలో పేద కుటుంబాలకు అండగా నిలవడం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సేవాభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఆయన నిరంతరం సేవలందిస్తున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొప్పుల అశోక్‌తో పాటు కొప్పుల రాంరెడ్డి, యన్నం అరుణరెడ్డి, ఎస్.కె. జానిబాబు, గన్నవరపు నాగరాజు, శ్రీరాములు, కదరయ్య, ధరమల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



