Type Here to Get Search Results !

అనుమతి లేని వైద్యశాలలు మూసివేత.

NAMASTHE NEWS 0

మెడికల్ కౌన్సిల్ నిబంధనలు ఉల్లంఘించిన ఫస్ట్ ఎయిడ్ సెంటర్లపై చర్యలు.
మరిపెడ మండలంలోని ఫస్ట్ ఎయిడ్ సెంటర్ సీజ్.






కారంపురి వెంకటేశ్వర్లు నేత.

డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 1(నమస్తే న్యూస్)

జిల్లాలో అక్రమంగా వైద్య సేవలు అందిస్తున్న కేంద్రాలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కొరడా ఝుళిపించింది. ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రవి రాథోడ్ ఆదేశాల మేరకు,మరిపెడ బంగ్లా మండలంలోని బి.ఎస్.రాజు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఆ సెంటర్లో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నిబంధనలకు విరుద్ధంగా సూదులు వేయడం,యాంటీబయాటిక్స్ మరియు ఇతర ప్రిస్క్రిప్షన్ మందులు రోగులకు ఇవ్వడం డి ఎం ఎచ్ ఓ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో డాక్టర్ బి.రవి రాథోడ్ స్పందిస్తూ,ఫస్ట్ ఎయిడ్ సెంటర్లలో ప్రాథమిక చికిత్స,గాయాలకు కట్టు కట్టడం, జ్వరం వంటి సాధారణ సమస్యలకు మాత్రమే సేవలు అందించాలి.ఎలాంటి సూదులు ఇవ్వడానికి,డయాగ్నసిస్ చేయడానికి,ప్రిస్క్రిప్షన్ మందులు ఇవ్వడానికి వీలు లేదు.నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా బి.ఎస్.రాజు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ను వెంటనే సీజ్ చేస్తున్నాం అని తెలిపారు. ఇలాంటి అక్రమ క్లినిక్ ల వల్ల ప్రజారోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని, క్వాలిఫైడ్ డాక్టర్లు లేకుండా చికిత్స చేయడం చట్టరీత్యా నేరమని ఆయన హెచ్చరించారు.ప్రజలు కూడా సర్టిఫికేట్ ఉన్న వైద్యుల వద్దనే చికిత్స తీసుకోవాలని సూచించారు.ఈ తనిఖీల కార్యక్రమంలో డి ఎం ఎచ్ ఓ వెంట వైద్య బృంద సభ్యులు మనోహర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.సీజ్ చేసిన సెంటర్ వద్ద నోటీసు అతికించి,రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.జిల్లాలో ఇలాంటి అక్రమ వైద్య కేంద్రాలపై నిరంతరం నిఘా ఉంటుందని,ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డి ఎం ఎచ్ ఓ స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System