అమరుల యాధిలో గీతన్నల చైతన్య బస్సు యాత్రను జయప్రదం చేయండి
సోషల్ మీడియా కన్వీనర్ బైరు రామకృష్ణ గౌడ్
రామన్నపేట, ఆగస్టు01(నమస్తే న్యూస్)
అమరుల యాధిలో పేరుతో నిర్వహిస్తున్న గీతన్నల చైతన్య బస్సు యాత్రను జయప్రదం చేయాలని సోషల్ మీడియా కన్వీనర్ బైరు రామకృష్ణ గౌడ్ సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేతివృత్తులలో అత్యంత ప్రమాదకరమైన వృత్తి గీత వృత్తి అని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు ఆగస్టు 2 నుండి 18 వరకు మానుకోట నుండి ట్యాంక్ బండ్ వరకు గీతన్నల చైతన్య బస్సు యాత్రను జయప్రదం చేయాలని యాత్ర వాల్ పోస్టర్ సోషల్ మీడియా వేదికగా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు,ఆగస్టు 9న రామన్నపేటకు చేరుకొనున్న బస్సు యాత్ర బృందానికి ఘనంగా స్వాగతం పలకాలని తదనంతరం భువనగిరిలో జరిగే సభకు యాదాద్రి భువనగిరి జిల్లా గీత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు, గీత వృత్తిలో ప్రమాదానికి గురై మంజూరైన ఎక్స్ గ్రేషియా డబ్బులను వెంటనే విడుదల చేయాలని గీత కార్మికులకు బడ్జెట్లో 5000 కోట్లు కేటాయించాలని గీత సంఘం భవనాలు మంజూరు చేయాలని పించన్ 4000 రూపాయలకు పెంచాలని వారు కోరారు ట్యాంకు బండి పై సర్వాయి పాపన్న విగ్రహాన్ని ప్రతిష్టించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

