- ఖమ్మం–సోలిపురం రాత్రి బస్సు పునరుద్ధరించాలి.. 30 గ్రామాల ప్రజల వినతి.
- రాత్రి బస్సు లేక ప్రయాణికుల ఇబ్బందులు.. ఆర్టీసీ అధికారులకు వినతిపత్రం.
- బీరోలు సర్పంచ్ గుమ్మడి దేవా బిక్షం ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పణ.
తిరుమలాయపాలెం,ఆగస్టు 1 ( నమస్తే న్యూస్ )
ఖమ్మం–కాకరవాయి–సోలిపురం రాత్రి బస్సు సర్వీసును వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ బీరోలు గ్రామ సర్పంచ్ గుమ్మడి దేవా బిక్షం ఆధ్వర్యంలో ఖమ్మం ఆర్టీసీ డిపో అసిస్టెంట్మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు.దమ్మాయిగూడెం నుంచి సోలిపురం వరకు దాదాపు 30 గ్రామాల ప్రజలు రాత్రి వేళ బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గతంలో సోలిపురంలో రాత్రి బస్సు హాల్టింగ్ ఉండేదని, అదే బస్సు మరుసటి రోజు ఉదయం ఖమ్మంకు బయలుదేరడంతో ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు, అత్యవసర ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడేదని గుర్తు చేశారు.ప్రస్తుతం ఆ సర్వీస్ నిలిచిపోవడంతో రాత్రి సమయంలో ప్రజలు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వస్తోందని, అత్యవసర పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఖమ్మం–కాకరవాయి–సోలిపురం రాత్రి బస్సు సర్వీసును తక్షణమే పునరుద్ధరించాలని ఆర్టీసీ అధికారులను కోరారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అధికారులు సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బీరోలు గ్రామ సర్పంచ్ గుమ్మడి దేవా బిక్షం, ఎస్కే జానీ బాబు, గుమ్మడి శ్యామ్ మరియు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

