- మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
- చిత్రపటాలకు ఘన నివాళులు.. బాధిత కుటుంబాలకు ఓదార్పు
నర్సింహులపేట, ఆగస్టు 2 (నమస్తే న్యూస్)
డోర్నకల్ నియోజకవర్గంలోని నర్సింహులపేట మండలం కౌసల్యదేవిపల్లి గ్రామానికి చెందిన ఏర్పుల మల్లయ్య ఇటీవల మృతి చెందడంతో మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే డి.ఎస్. రెడ్యానాయక్ ఆదివారం ఆయన నివాసానికి చేరుకుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ విషాదాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని, తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు.అనంతరం అదే గ్రామపంచాయతీ పరిధిలోని రూపులతండాకు చెందిన బానోతు కోటియా, బానోతు సూక్యలు ఇటీవల మృతి చెందడంతో వారి నివాసాలకు చేరుకున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే డి.ఎస్. రెడ్యానాయక్ ఇరువురి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారి దుఃఖంలో తాము భాగస్వాములమని పేర్కొంటూ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ పరామర్శ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ రవి నాయక్, మాజీ సర్పంచ్ బండ బిక్షం రెడ్డి, రేపటి చంద్రారెడ్డి, గొట్టిముక్కుల నరసింహారెడ్డి, బొడ శ్రీను నాయక్, సరిత, కొత్త వెంకటయ్య, వార్డు సభ్యులు ఏర్పుల కిరణ్, ఉప్పుటూరి కేతమ్మ, సుబ్బారావు, స్రవంతి, సురేష్, మాజీ యువజన అధ్యక్షుడు మండల సురేష్ నాయక్, అందే మధు, ఏర్పుల వెంకటేష్, ఇస్సాంపల్లి అనిల్, గండి మల్లేష్, కొప్పుల వెంకన్న, జైపాల్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

