Type Here to Get Search Results !

వ్యవసాయ అధికారి వినూత్న ప్రచారం.... జానపద పాటలతో రైతులకు అవగాహన

NAMASTHE NEWS 0

పంట మార్పిడితో ప్రయోజనాలు... రైతుల అవగాహన పెంపొందించుకోవాలి.



రిపోర్టర్:పిల్లల నరసింహారావు 

సెంటర్, బయ్యారం 

రైతుల్లో పంటల వైవిధ్యం (క్రాప్ డైవర్సిఫికేషన్)పట్ల అవగాహన కల్పించేందుకు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారి కే.రాజు వినూత్న ప్రచారం చేపట్టారు.బయ్యారం మండలంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంట మార్పిడిపై వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు.రైతులతో కలిసి గ్రామ వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తూ డప్పు కొడుతూ జానపద పాటల ద్వారా పంట మార్పిడి వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు సులువుగా వివరించారు.ఒకే పంటను వరుసగా సాగు చేయడం వల్ల నేల సారం తగ్గిపోతుందని,వరి,మొక్కజొన్న పంటల్లో అధికంగా యూరియా వినియోగించడం వల్ల నేల నాణ్యత దెబ్బతినడంతో పాటు సాగు ఖర్చులు పెరిగే ప్రమాదం ఉందని రైతులకు వివరించారు.రైతులకు వాంకుడోతూ వీర్య గారి ఆయిల్ పామ్ పంట పొలానికి తీసుకువెళ్ళి,సాగు విధానాలను ఇతర రైతులకు వివరించడం జరిగింది..పంట మార్పిడిని పాటించడం,సమతుల్యంగా ఎరువులు వినియోగించడం ద్వారా నేల సారం మెరుగుపడి,అధిక దిగుబడులు సాధించవచ్చని రైతులకు సూచించారు.ఈ అవగాహన కార్యక్రమానికి  పెద్ద సంఖ్యలో గ్రామ రైతులు హాజరై వ్యవసాయ శాఖ సూచనలు పాటిస్తామన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System