Type Here to Get Search Results !

యువ పర్వతారోహకునికి.. సాహస ఐకాన్ పురస్కారం.

NAMASTHE NEWS 0

తెలంగాణ–2026 యువ సాహస ఐకాన్ పురస్కారం అందుకున్న యశ్వంత్.
నటుడు సోనూ సూద్ చేతుల మీదుగా అవార్డు ప్రదానం. 
యువతకు స్ఫూర్తిగా నిలవాలని సోనూ సూద్ పిలుపు.  
ఆనందం వ్యక్తం చేసిన యువ సాహసికుడు యశ్వంత్.





డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 02 (నమస్తే న్యూస్): 

రిపోర్టర్: కారంపురి వెంకటేశ్వర్లు. సెల్: 7893556455

ఎక్సలెన్స్ తెలంగాణ–2026 అవార్డుల ప్రదానోత్సవంలో మరిపెడకు చెందిన ఎన్నో సాహసోపేతమైన పర్వతాలను అధిరోహించిన యువ సాహసికుడు భూక్య యశ్వంత్ యువ సాహస ఐకాన్ పురస్కారాన్ని దక్కించుకున్నారు.హైదరాబాదులోని నోవోటెల్ అంతర్జాతీయ సమావేశ కేంద్రంలో జరిగిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ప్రముఖ నటుడు సోనూ సూద్ చేతుల మీదుగా యశ్వంత్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా సోనూ సూద్ మాట్లాడుతూ,యశ్వంత్ లాంటి యువకులు దేశానికి ఆదర్శం.కష్టాలను ఎదిరించి పర్వతాలు ఎక్కడమే కాదు,జీవితంలో కూడా పైకి ఎదగాలనే తపన చాలా గొప్పది.తెలంగాణ యువత ఇతనిని చూసి స్ఫూర్తి పొందాలి.నా వంతు సహాయం ఎప్పుడూ ఉంటుంది అని అన్నారు.అవార్డు అందుకున్న అనంతరం భూక్య యశ్వంత్ తన సంతోషాన్ని పంచుకున్నారు.తనకు ఈ గౌరవాన్ని అందించిన ఈటీ ఎక్సలెన్స్ నిర్వాహకులకు,అవార్డు ఇచ్చిన సోనూ సూద్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.సోనూ సూద్ ఇచ్చిన ప్రోత్సాహం నాకు మరింత ధైర్యాన్ని ఇచ్చింది.జీవితంలో ఇంకా ఎన్నో విజయాలు సాధించేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తాను అని యశ్వంత్ అన్నారు.ఈ గౌరవం తన ఒక్కడిదే కాదని,తన ప్రయాణంలో ప్రతి అడుగులో తోడుగా నిలిచిన కుటుంబ సభ్యులు,మిత్రులు,శ్రేయోభిలాషులందరికీ ఈ పురస్కారాన్ని అంకితం ఇస్తున్నానని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సాహసాలు చేసి తెలంగాణకు మంచి పేరు తీసుకురావడానికి పాటుపడతానని భూక్య యశ్వంత్ చెప్పారు.





Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System