Type Here to Get Search Results !

మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే డి.ఎస్.రెడ్యా నాయక్..

NAMASTHE NEWS 0

  • మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన.
  • మాజీ ఎమ్మెల్యే ఢీ ఎస్.రెడ్యా నాయక్.



డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 02(నమస్తే న్యూస్).

మరిపెడ మండలం చిల్లంచెర్ల గ్రామానికి చెందిన పగిళ్ల సోమయ్య ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్తులయ్యారు.పగిళ్ల సోమయ్య గ్రామంలో అందరితో కలివిడిగా ఉంటూ,అవసరంలో ఉన్నవారికి ఎప్పుడూ అండగా నిలిచేవారని గ్రామస్థులు గుర్తు చేసుకున్నారు.

విషయం తెలుసుకున్న డోర్నకల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డి.ఎస్.రెడ్యానాయక్ పాల్గొని పగిళ్ల సోమయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం సోమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.దుఃఖంలో ధైర్యంగా ఉండాలని,సోమయ్య మరణం మీ కుటుంబానికి తీరని లోటన్నారు.

ఈ కార్యక్రమంలో రెడ్యానాయక్ వెంట గాదె అశోక్ రెడ్డి,తాళ్ల జయపాల్ రెడ్డి,దూడపాక బుచ్చయ్య,పిట్టల ధనుంజయ,గోవర్ధన్ రెడ్డి,బుల్లి వెంకన్న,దూడపాక వెంకన్న,ఉరుముడ్ల శ్రీను,ఎం.శ్రీను,శ్రీశైలం,పులి వెంకన్న,పగిళ్ల కిష్టయ్య,పగిళ్ల శ్రీను,తదితర గ్రామ నాయకులు,కార్యకర్తలు పాల్గొని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.పగిళ్ల సోమయ్య ఆత్మకు శాంతి చేకూరాలని,వారి కుటుంబానికి ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు ఇవ్వాలని అందరూ ప్రార్థించారు.ఇంకా గ్రామ పెద్దలు, యువకులు,మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System