Type Here to Get Search Results !

భారతదేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్న అమెరికా

NAMASTHE NEWS 0


  • భారతదేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్న అమెరికా 
  • ట్రంప్‌కు లొంగిపోయిన దేశ ప్రధాని మోదీ.
  • సిపిఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు



రామన్నపేట,ఆగస్టు 02(నమస్తే న్యూస్)

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల సిపిఎం రాజకీయ శిక్షణా తరగతుల రెండవ రోజు కార్యక్రమం ఎంజీ గార్డెన్‌లో ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు "ప్రస్తుత రాజకీయ పరిణామాలు" అనే అంశంపై రాజకీయ తరగతిని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థపై అమెరికా సామ్రాజ్యవాద విధానాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అన్నారు.ప్రపంచంలోని చమురు సంపద కలిగిన దేశాలపై ఆధిపత్యం సాధించడం, తమ ప్రయోజనాలకు అనుకూలంగా లేని ప్రభుత్వాలపై రాజకీయ, ఆర్థిక ఒత్తిళ్లు తీసుకురావడం అమెరికా విధానంగా మారిందని పేర్కొన్నారు.అమెరికా విధానాలకు అనుగుణంగా భారత ప్రభుత్వం వ్యవహరిస్తోందని, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తలొగ్గారని ఆయన విమర్శించారు. ఈ విధానాల ప్రభావంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, పెరుగుతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతులు–కార్మికులపై పెరుగుతున్న భారం వంటి పరిణామాలు ప్రజల జీవన ప్రమాణాలను దిగజార్చుతున్నాయని అన్నారు.

దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడే స్వతంత్ర ఆర్థిక విధానాలను అమలు చేయాలని, ప్రజాస్వామ్య, లౌకిక విలువలను పరిరక్షించేందుకు వామపక్ష శక్తులను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.

విద్యా,వైద్యాన్ని గాలికొదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలి*

– సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ జహంగీర్

రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలను ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యానికి గురిచేసిందని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ జహంగీర్ అన్నారు.సిపిఎం రామన్నపేట మండల రాజకీయ శిక్షణా తరగతుల రెండవ రోజు నిర్వహించిన సమావేశంలో ఆయన "రాష్ట్ర రాజకీయ పరిస్థితులు – ప్రజా సమస్యలు" అనే అంశంపై ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని అన్నారు. ప్రభుత్వ విద్య, వైద్య రంగాలపై తగిన శ్రద్ధ, నిధులు, సిబ్బంది నియామకాలు లేకపోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.సిపిఎం ఆధ్వర్యంలో గత నెల రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించిన సర్వేలో మౌలిక వసతుల కొరత, ఉపాధ్యాయులు, వైద్యులు, సిబ్బంది ఖాళీలు, తాగునీరు, మరుగుదొడ్లు, మందులు, వైద్య పరికరాల కొరత వంటి అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. ఈ సమస్యలు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయని అన్నారు.ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బందిని నియమించడం, అన్ని రకాల వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రజల సంక్షేమానికి విద్య, వైద్యం పునాది రంగాలని, వాటిని బలోపేతం చేయకుండా రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదని ఆయన అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ రాజకీయ శిక్షణా తరగతులకు ప్రిన్సిపాల్ గా బొడ్డుపల్లి వెంకటేశం వ్యవగారించిగా ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జల్లెల పెంటయ్య, జిల్లా కమిటి సభ్యులు వనం ఉపేందర్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు   కూరెళ్ళ నర్సింహా చారి, బోయిని ఆనంద్, కందుల హనుమతు, కల్లూరి నగేష్, జంపాల అండాలు, మండల కమిటి సభ్యులు గొరిగే సోములు, గన్నేబోయిని విజయభాస్కర్,నాగటి ఉపేందర్, ఎండీ రషీద్,బావండ్లపల్లి బాలరాజు,ఆవనగంటి నగేష్,తోలుపునూరి శ్రీనివాస్, మేడి గణేష్, కార్యదర్శులు అంబటి మల్లారెడ్డి,మునికుంట్ల లెనిన్, పులి బిక్షం,అవనగంటి రవీందర్,గంగాదేవి మల్లేష్, అప్పం సురేందర్, మెట్టు శ్రవణ్ కుమార్,మేడి ముకుంద,శానాగొండ రాము, పుట్టల ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System