మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్సీ తాతా మధు
తిరుమలాయపాలెం,ఆగస్టు 1 (నమస్తే న్యూస్ )
తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన చామకూరి సత్యం ఇటీవల తీవ్ర అనారోగ్య సమస్యలతో అకాల మరణం చెందగా, నేడు *తెలంగాణ శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీ) తాతా మధుసూదన్*, పిండిప్రోలు గ్రామంలోని చామకూరి సత్యం నివాసానికి చేరుకుని, వారి చిత్రపటానికి పూలమాలలు తో నివాళులు అర్పించి, అనంతరం శోకసంద్రంలో ఉన్న చామకూరి శరత్ మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, గ్రామంలో అందరితో ఆప్యాయంగా ఉండే మంచి వ్యక్తిని కోల్పోవడం తీరని లోటని పేర్కొన్నారు. సత్యం కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామని చెప్పారు.ఈ పరామర్శ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌తో పాటు గ్రామ ఉప సర్పంచ్ చామకూరి రాజు, పరికిపల్లి శేఖర్, దూదిమెట్ల శ్రీనివాస్ యాదవ్,చామకూరి కిరణ్, ప్రవీణ్, నాతి సత్యం, పాల వెంకన్న, చామకూరి రమేష్, రాంబాబు, మల్సూర్ మరియు తదితర నాయకులు పాల్గొని శరత్ కుటుంబానికి తమ సానుభూతిని తెలిపారు.

