- కార్మికుల హక్కుల సాధనే ఏఐటీయూసీ ధ్యేయం
- భవన నిర్మాణరంగా కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
- మహాసభల కరపత్రాలు ఆవిష్కరణ
- ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు
రిపోర్టర్:దామల్ల భాస్కర్.
తిరుమలాయపాలెం, ఆగస్టు 1 (నమస్తే న్యూస్ )
106 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాలు త్యాగాల చరిత్ర గలిగిన ఏఐటియుసి కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతోందని, సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తోటా రామాంజనేయులు అన్నారు. శనివారం తిరుమలాయపాలెం మండల పరిధిలోని కాకరవాయి గ్రామంలో బిల్డింగ్ వర్కర్స్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ యూనియన్ సమావేశంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు... ఏఐటీయూసీ అనేక కార్మిక రంగాల్లో విస్తరించి కార్మిక సంఘాలు ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. కార్మిక సంక్షేమ బోర్డులో భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు సంక్షేమ బోర్డు నుండి అందాల్సిన పథకాలను అధికారులు నిర్లక్ష్యంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. అనంతరం ఈనెల 23 24 వ తేదీలలో సత్తుపల్లి పట్టణంలో జరగబోయే ఎఐటిఈసి ఖమ్మం జిల్లా 17వ మహాసభల కరపత్రాలను కార్మికులతో కలిసి ఆవిష్కరించారు. సంఘటిత, అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న కార్మికులు వేలాది మంది కార్మికులు ఈ మహాసభలలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గుండెపంగు మల్లేష్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు రంగయ్య, నాయకులు శ్రీను, రవి, ఆంజనేయులు, శ్రీనివాసు, తదితరులు పాల్గొన్నారు.

.jpeg)
