Type Here to Get Search Results !

#BREAKING NEWS# హాస్టల్ సౌకర్యాలు, గ్రామపంచాయతీ నిర్వహణ పై డీపీఓ రేవంత్ ఆకస్మిక తనిఖీలు.

NAMASTHE NEWS 0

  • హాస్టల్ సౌకర్యాలు, గ్రామపంచాయతీ నిర్వహణ పై డీపీఓ రేవంత్ ఆకస్మిక తనిఖీలు.
  • బీసీ హాస్టల్, గ్రామపంచాయతీ లో.. డీపీఓ రేవంత్ ఆకస్మిక తనిఖీ.
  • మండల ప్రజా పరిషత్ కార్యాలయం పనితీరుపై డీపీఓ నిఘా.. పరిశుభ్రత, సేవలపై కీలక సూచనలు.




నర్సింహులపేట, జూలై 29 (నమస్తే న్యూస్)

మహబూబాబాద్ జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) వై. రేవంత్ బుధవారం మహబూబాబాద్ జిల్లా  నర్సింహులపేట మండల కేంద్రంలోని బీసీ బాలుర హాస్టల్, గ్రామపంచాయతీ, మండల ప్రజా పరిషత్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ముందుగా బీసీ బాలుర హాస్టల్‌లో పరిశుభ్రత, విద్యార్థులకు కల్పిస్తున్న వసతి, తాగునీరు, ఆహార మెనూ, ఆహార నిల్వలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని, భోజన ప్లేట్లు, గ్లాసులు, బెడ్‌షీట్లు పంపిణీ చేశారు. అనంతరం అల్పాహారాన్ని రుచి చూసి నాణ్యతను పరిశీలించారు.గ్రామపంచాయతీ కార్యాలయంలో నగదు పుస్తకాలు, స్టాక్ రిజిస్టర్లు, చెల్లింపు వివరాలు, బ్లీచింగ్ పౌడర్ నిల్వలను తనిఖీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నాలుగు రకాలుగా చెత్తను వేర్వేరుగా సేకరించే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించి, కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.తదుపరి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డీఎల్‌పీఓ ఆర్. పుల్లారావు, ఎంపీడీఓ జి. రాంప్రసాద్‌రావు, ఎంపీఓ బి. అశోక్, సర్పంచ్ యాకయ్య, ఉప సర్పంచ్ యాకయ్య తదితరులు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System