జోరందుకున్న వానాకాలపు వరి నాట్లు.. రైతుల్లో కొత్త ఆశలు
పొలాల బాట పట్టిన రైతన్నలు.. జోరుగా కొనసాగుతున్న వరి నాట్లు
అనుకూల వర్షాలతో ఖరీఫ్‌కు శుభారంభం.. జోరందుకున్న వరి నాట్లు
నర్సింహులపేట, జూలై 29 (నమస్తే న్యూస్)
గత రెండు రోజులుగా కురుస్తున్న మోస్తూరు వర్షాలతో మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో వానాకాలపు వరి నాట్లు ఊపందుకున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురవడంతో రైతులు వ్యవసాయ పనులను వేగవంతం చేస్తూ వరి నాట్లలో నిమగ్నమయ్యారు.మండలంలోని బోర్లు, బావుల ఆధారంగా సాగు చేస్తున్న రైతులు ఉదయం నుంచే పొలాల్లోకి దిగి నాట్ల పనులు చేపడుతున్నారు. కూలీలతో కలిసి కుటుంబ సభ్యులు కూడా నాట్ల పనుల్లో పాల్గొనడంతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ వాతావరణం కళకళలాడుతోంది.ఇటీవలి వర్షాలతో చెరువుల్లోకి కొంతమేరకు నీరు చేరడం, భూగర్భ జలాలు పెరగడం రైతులకు మరింత ఊరటనిచ్చింది. ఈసారి వర్షాలు ఇలాగే కొనసాగితే సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు వరి దిగుబడులు కూడా ఆశించిన స్థాయిలో వస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


