ఏజెన్సీ లోని భూ సమస్యలను పరిష్కరించాలి: ఆదివాసి సంక్షేమ పరిషత్.
బయ్యారం,జూలై 26 (నమస్తే న్యూస్)
ఏజెన్సీ ప్రాంతంలోని భూ సమస్యలను పరిష్కరించేందుకు సహకరించాలని మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డిని ఆదివాసి సంక్షేమం పరిషత్ నాయకులు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పూనెం శ్రీనివాస్ ఆదివారం సెక్రటేరియేట్ లో తెలంగాణ రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని కలిసి ఏజెన్సీ ప్రాంతంలోని భూ సమస్యల పైన మెమోరండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ మహబూబాబాద్ జిల్లా నాయకులు తాటి సుధాకర్ ,ఈసాల సురేష్ జాయింట్ సెక్రెటరీ ఆదివాసి సంక్షేమ పరిషత్, సూర్ణపాక రాకేష్, సనప సందీప్, ఆదివాసి సంక్షేమ పరిషత్ బయ్యారం మండల అధ్యక్షులు జేఏసీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.

