వారపు సంతకు భద్రతా ఏర్పాట్లు.
దుకాణదారులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు.
సర్పంచ్ పెద్దమాముల యాకయ్య.
నర్సింహులపేట, జూలై 26 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహించే వారపు సంతకు వచ్చే వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా గ్రామ సర్పంచ్ పెద్దమాముల యాకయ్య ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మార్కెట్ ప్రాంగణం చుట్టూ భద్రత కల్పించేలా ఫెన్సింగ్ ఏర్పాటు పనులను శనివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ పెద్దమాముల యాకయ్య మాట్లాడుతూ, వారపు సంతకు పెద్ద సంఖ్యలో వ్యాపారులు, ప్రజలు వస్తున్నందున వారి భద్రతతో పాటు మార్కెట్ నిర్వహణ మరింత క్రమబద్ధంగా ఉండేలా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఫెన్సింగ్ ఏర్పాటు పూర్తయిన తర్వాత సంత ప్రాంగణంలో వ్యాపారులు సౌకర్యవంతంగా దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు, ప్రజలు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా గొర్రెలు,మేకలు కొనుగోళ్లు నిర్వహించుకునేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో అవసరమైన మౌలిక సదుపాయాలను దశలవారీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కాసా యాకన్న, వేముల శ్రీను, మా శెట్టి యాకన్న, తదితరులు పాల్గొన్నారు.

