Type Here to Get Search Results !

తిప్పారెడ్డిగూడెం-పాతర్లపాడు రహదారి ధ్వంసం... నరకప్రాయంగా మారిన రాకపోకలు

NAMASTHE NEWS 0

తిప్పారెడ్డిగూడెం-పాతర్లపాడు రహదారి ధ్వంసం: నరకప్రాయంగా మారిన రాకపోకలు.




తిరుమలాయపాలెం,జూలై 26 (నమస్తే న్యూస్ )

నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న భారీ వాహనాల సంచారం రెండు గ్రామాల మధ్య దశాబ్దాల అనుబంధాన్ని తెంచేసింది. తిప్పారెడ్డిగూడెం నుండి పాతర్లపాడు వెళ్లే ప్రధాన రహదారి భారీ లోడ్ వాహనాల ధాటికి తట్టుకోలేక పూర్తిగా కుంగిపోవడంతో ఉభయ గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. గోల్ తండా నుండి ఆదర్శ పేట వరకు నూతనంగా చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనుల కోసం మెటీరియల్‌ను తరలిస్తున్న కాంట్రాక్టర్ల నిర్వాకమే ఈ దుస్థితికి కారణమని స్థానికులు మండిపడుతున్నారు. ప్రధాన రహదారి గుండా వెళ్లాల్సిన భారీ వాహనాలు ఇంధన ఆదా, సమయం కలిసి వస్తుందనే నెపంతో ఈ చిన్న అంతర్గత రహదారిని షార్ట్‌కట్‌గా ఎంచుకున్నాయి. గ్రామీణ అవసరాల కోసం నిర్మించిన ఈ రోడ్డుపై సామర్థ్యానికి మించి వందల టన్నుల మెటీరియల్‌తో లారీలు నిరంతరం ప్రయాణించడంతో, మార్గమధ్యంలో ఉన్న మోరీలు (చిన్న వంతెనలు) కుప్పకూలాయి.రెండు గ్రామాలకు ఇదే ఏకైక ప్రధాన రహదారి కావడంతో ప్రస్తుతం జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. నిత్యం పొలాలకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు అడుగు ముందుకు వేయలేని పరిస్థితి నెలకొంది.  గ్రామీణ రోడ్లను ధ్వంసం చేస్తున్న భారీ వాహనాలపై అధికారులు ముందు చూపుతో చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ అపశ్రుతి చోటుచేసుకుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ చూపి, యుద్ధప్రాతిపదికన నిధులు మంజూరు చేసి కుంగిపోయిన మోరీలకు రిపేర్లు చేయించాలని, రవాణా సౌకర్యాన్ని పునరుద్ధరించి తమను ఈ నరకయాతన నుండి గట్టెక్కించాలని ఉభయ గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.ఈ ప్రమాద తీవ్రతను గుర్తించిన పాతర్లపాడు సర్పంచ్ జడల సుష్మ రమేష్, తిప్పారెడ్డి గూడెం సర్పంచ్ కుంభ ఉపేందర్ మరియు ఉపసర్పంచ్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా యుద్ధప్రాతిపదికన ప్రాథమిక సహాయ చర్యలు చేపట్టారు. తాత్కాలికంగా రాకపోకలు సాగించేందుకు వీలుగా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ చూపి, శాశ్వత పరిష్కారంగా యుద్ధప్రాతిపదికన నిధులు మంజూరు చేసి కుంగిపోయిన మోరీలకు రిపేర్లు చేయించాలని, రవాణా సౌకర్యాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించి తమను ఈ నరకయాతన నుండి గట్టెక్కించాలని ఉభయ గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System