పాతర్లపాడు తిప్పారెడ్డిగూడెం గ్రామాలకు మళ్లీ రాకపోకలు...
సర్పంచ్ చొరవతో రహదారి పునర్నిర్మాణం.
రిపోర్టర్ :దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం,జూలై 30 (నమస్తే న్యూస్ )
తిరుమలాయపాలెం మండలం లోని పాతర్లపాడు గ్రామ సర్పంచ్ జడల సుష్మ _ రమేష్ చొరవతో పాతర్లపాడు తిప్పారెడ్డిగూడెం గ్రామాల ప్రజలకు ఊరట లభించింది. అట్టి రహదారిలో భారీ డంపర్లు రాకపోకలు కొనసాగించడంతో కుంగిపోయిన కల్వర్టును గుర్తించి వెంటనే స్పందించిన పాతర్లపాడు సర్పంచ్ జడల సుష్మ రమేష్ తన సొంత ఖర్చులతో మరమ్మత్తు పనులు చేపట్టించారు.అంతేకాకుండా, రెండు గ్రామాల మధ్య దెబ్బతిన్న రహదారిని కల్వర్టును పునర్నిర్మించి ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలు కల్పించారు. అసలే వర్షాకాలం రెండు గ్రామాలకు రైతుల రాకపోకలు వ్యవసాయ పనుల నిమిత్తం రెండు రోజులు స్తంభించి ఇబ్బందులు పడుతున్న తరుణంలో పాతర్లపాడు సర్పంచ్ జడల సుష్మ రమేష్ చొరవ తీసుకొని తన సొంత ఖర్చులతో కల్వర్టుకు పైపులు తెప్పించి మట్టితో కుంగిపోయిన రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పనులు చేపట్టి రోడ్డు పున నిర్మాణం చేయటంతో రెండు గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు ఈ రెండు గ్రామాల మధ్యన గత రెండు రోజులుగా ఆర్టీసీ సర్వీస్ బస్సు పాఠశాలకు వెళ్లే ప్రైవేట్ బస్సులు రాకపోవడంతో రైతులకు వ్యవసాయ పనులకు వెళ్లే రహదారి కుంగిపోవటంతో రాకపోకలకు నానా ఇబ్బందులు కలిగినాయి సర్పంచ్ జడల సుష్మ రమేష్ చొరవతో రోడ్డు నిర్మాణంతో ప్రజలు సంతోషం వ్యక్తం.సర్పంచ్ తీసుకున్న ఈ తక్షణ చర్యలను స్థానికులు ప్రశంసిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారంలో చూపిన చొరవకు అభినందనలు తెలియజేస్తున్నారు. రెండు గ్రామాల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ సర్పంచ్ జడల సుష్మ రమేష్ సేవాభావాన్ని కొనియాడారు.

