పోక్సో కేసులో ఇద్దరు అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు.
తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను గమనించాలి.
అనుమానాస్పద కదలికలకలపై ఆరా తీయాలి.
-ఎస్సై రవికుమార్.
దంతాలపల్లి,జూలై 30( నమస్తే న్యూస్)
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులను పోక్సో కేసులో దంతాలపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.పోలీసుల వివరాల ప్రకారం.. మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించి, ఆమెను తీసుకెళ్లిన ఘటనపై బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మంగళపల్లి శ్రీనివాస్ (24)ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది.అదే కేసులో మైనర్ బాలికకు, ప్రధాన నిందితుడికి ఆశ్రయం కల్పించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మంగళపల్లి గంగాధర్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు పంపించారు.ఈ సందర్భంగా ఎస్సై రవి కుమార్ మాట్లాడుతూ, మైనర్ పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లల్లో అనుమానాస్పద కదలికలు లేదా మార్పులు కనిపిస్తే వెంటనే ఆరా తీసి, అవసరమైతే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మైనర్లకు సంబంధించిన నేరాల విషయంలో చట్టం కఠినంగా అమలవుతుందని హెచ్చరించారు.

